తుఫాను దెబ్బకు పంట నష్టం: క్షేత్రస్థాయి పరిశీలన అధికారులు..పాలకొండ వెబ్ న్యూస్' కథనానికి తక్షణ స్పందన!


పాలకొండ: (పాలకొండ వెబ్ న్యూస్)

'మొంథా' తుపాను (స్పందన తుఫాను) వల్ల నష్టపోయిన పంటలను పరిశీలించేందుకు అధికారులు ఈ రోజు (1.11.2025) క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. 'తుఫాను దెబ్బకు పంట నష్టం క్షేత్రస్థాయి పరిశీలన అధికారులు' అనే శీర్షికతో 'పాలకొండ వెబ్ న్యూస్'లో కథనం ప్రచురించబడిన నేపథ్యంలో, ఈ అంశంపై తక్షణ స్పందన లభించింది.

రైతు వినతి.. సబ్ కలెక్టర్ ఆదేశం:

అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాదరావు మొలకలు వచ్చిన కంకులను మన్యం జిల్లా సబ్‌ కలెక్టర్‌ వారికి చూపించి, పంట నష్ట పరిహారం కోసం రెవెన్యూ, వ్యవసాయ శాఖల పరిశీలన కోరుతూ 31.10.2025న వినతిపత్రం సమర్పించారు. దీనిపై తక్షణమే స్పందించిన సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం నుంచి ఆదేశాలు అందడంతో, ఈ రోజు మధ్యాహ్నం అధికారులు రైతు క్షేత్రానికి చేరుకున్నారు.

పరిశీలించిన బృందం:

పరిశీలన చేసిన అధికారుల బృందంలో వెలగవాడ సచివాలయం వీఆర్‌ఓ కోట రామచంద్రరావు, వ్యవసాయ సహా సంచాలయకులు పవిత్ర, వెల్ఫేర్‌ అధికారి వరహాల నాయుడు ఉన్నారు. వీరు క్షేత్రస్థాయిలో జరిగిన నష్టాన్ని పరిశీలించి, వివరాలు నమోదు చేసుకుని, ఫోటోలు తీశారు.

Post a Comment

0 Comments