పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ పాలకొండ సబ్ డివిజన్ కార్యాలయం వార్షిక తనిఖీపోలీస్ వ్యవస్థ పనితీరుపై సమీక్ష; పెండింగ్ కేసుల త్వరిత దర్యాప్తుకు సూచన


📰 పాలకొండ వెబ్ న్యూస్, నవంబర్ 14:
పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. వి. మాధవ్ రెడ్డి, ఐపీఎస్ గారు వార్షిక తనిఖీల్లో భాగంగా నవంబర్ 13వ తేదీన పాలకొండ సబ్ డివిజన్ కార్యాలయాన్ని సందర్శించారు.
జిల్లా ఎస్పీ  పాలకొండ డీఎస్పీ ఎం. రాంబాబు, పాలకొండ సర్కిల్ సీఐ ప్రసాద్ రావు, పాలకొండ ఎస్సైలు పుష్పగుచ్ఛం అందజేసి సాదర స్వాగతం పలికారు. అనంతరం ఎస్పీ గారు సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు.
కేసుల దర్యాప్తులో వేగం పెంచండి:
పెండింగ్‌లో ఉన్న ఎస్సీ/ఎస్టీ కేసులు, పోక్సో కేసుల దర్యాప్తు తీరుపై ఎస్పీ  ప్రత్యేకంగా ఆరా తీశారు. సదరు కేసుల ఛేదింపునకు దోహదపడే విధంగా అనుసరించాల్సిన దర్యాప్తు విధానాలపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
కంపెరిటివ్ స్టేట్‌మెంట్‌, నిర్వహించే రికార్డ్స్‌ పెండింగ్ లేకుండా సక్రమంగా నిర్వహించాలని, గంజాయి, నాటుసారా అక్రమ రవాణా నియంత్రణకు, రోడ్డు ప్రమాదాల నివారణకు సబ్ డివిజన్ పరిధిలో పటిష్ట చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశాలు జారీచేశారు.
శాంతి భద్రతలు – మార్గదర్శకాలు:
సబ్-డివిజినల్ పరిధిలో గల శాంతి భద్రతల సమస్యల గురించి ఎస్పీ అడిగి తెలుసుకొని తగు మార్గదర్శకాలు తెలియజేశారు. అలాగే పోలీస్ ప్రధాన కార్యాలయానికి సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలు సక్రమంగా జరుగుతున్నాయో లేదో పరిశీలించారు.
సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగిన ఆదేశాలు, మార్గదర్శకాలు చేయాలని డీఎస్పీ కి జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా ఆదేశించారు.
ఈ తనిఖీలో పాలకొండ డీఎస్పీ ఎం. రాంబాబు, పాలకొండ సర్కిల్ సీఐ ప్రసాద్ రావు, ఎల్విన్‌పేట సర్కిల్ సీఐ హరి, పాలకొండ ఎస్సై ప్రయోగమూర్తి, వీరఘట్టం ఎస్సై కళాధర్, చినమేరంగి ఎస్సై అనిష్, నీలకంటాపురం ఎస్సై నీలకంఠం, సీసీ సంతోష్‌తో పాటు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

0 Comments