పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ వెబ్ న్యూస్ : పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ మండలం శేఖర్ కళ్యాణ మండపంలో ఈరోజు జరిగిన సమావేశంలో ఏపీ సొండి కుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రత్నాల కాశీ విశ్వనాథం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లకు సొండీ కుల సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. గతంలో ఏ ప్రభుత్వమూ తమ కులస్తుల గురించి ఆలోచించలేదని, అయితే కూటమి ప్రభుత్వం సొండీ కులాన్ని ప్రత్యేకంగా గుర్తించి వారికి రాష్ట్రంలో 10% షాపులను కేటాయించినందుకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయాన్ని సొండీ కులస్తులందరూ స్వాగతిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో, తమ కుల జనాభా (కులగణన) ప్రకారం మరికొన్ని షాపులను కేటాయిస్తే బాగుంటుందని వారు భావిస్తున్నారని, దీనిని ప్రభుత్వం పెద్ద మనసుతో ఆలోచించి కేటాయించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
విజయనగరంలో వనభోజనం మహోత్సవం: ముఖ్య అతిథిగా మంత్రి
కొండపల్లి శ్రీనివాస్ ఈ సందర్భంగా సంఘం తరఫున మరో ముఖ్య
విషయాన్ని కూడా ఆయన వెల్లడించారు. ఈ ఆదివారం విజయనగరంలో జరగబోయే వనభోజనం మహోత్సవం కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా హాజరవుతారని
తెలిపారు. కావున, పాలకొండ నియోజకవర్గంలో ఉన్న సొండీ
సోదరులు ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన ప్రత్యేకంగా
ఆహ్వానం పలికారు.

0 Comments