శ్రీరామగిరి క్షేత్రంలో అశేష భక్తజనానికి మహా అన్నదానం

 

ramagiri seetehampeta palakonda division

పాలకొండ
వెబ్ న్యూస్ : పార్వతీపురం మన్యం జిల్లా: పార్వతీపురం మన్యం జిల్లాలోని పుణ్యక్షేత్రం శ్రీరామగిరిలో నేడు మహా అన్నదాన కార్యక్రమం వైభవంగా జరిగింది. క్షేత్రంలోని ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పవిత్రమైన వాతావరణంలో జరిగిన ఈ అన్నదానం సందర్భంగా వేలాది మంది భక్తులు, స్థానికులు అన్నప్రసాదం స్వీకరించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు ఎస్.పి. పెంటయ్య పర్యవేక్షణలో, కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జి. రామునాయుడు, నిమ్మక రామారావు, గేదెల ప్రసాద్రావు, సిహెచ్. సౌజన్య, ఏ. భాస్కర రావు, జి. రాజారావు, జి ప్రసాదరావు ప్రిన్సిపాల్ నవీన్ కుమార్  ప్రధాన అర్చకులు సంతోష్ ఈ మహా అన్నదానంలో కమిటీ సభ్యులు తదితరులు పాల్గొని భక్తులకు సేవలు అందించారు. భక్తులందరికీ అన్నదానం చేసిన ఆలయ కమిటీకి స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

Post a Comment

0 Comments