నెరవేరిన తెలుగు భక్తుల కల: వట్టప్పారా వద్ద అన్నదాన మహాప్రసాదం సేవ ప్రారంభం!

పాలకొండ వెబ్ న్యూస్ :శబరిమల యాత్రకు వచ్చే తెలుగు రాష్ట్రాల భక్తులకు ఎంతో కాలంగా ఉన్న సంకల్పం ఎట్టకేలకు నెరవేరింది. నాలుగు రాష్ట్రాల భక్తుల సహాయ సహకారాలతో వట్టప్పారా (TWA పంపా) వద్ద అన్నదాన భవనం మరియు విశ్రాంతి భవనం ఏర్పాటు చేసే శుభకార్యం నిన్న పూర్తయింది. ఈ ఏర్పాటంతా స్వామివారి అనుగ్రహం అని, అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప అని నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు. పాలకొండ పట్టణానికి చెందిన ఉమా రుద్ర కోటేశ్వరరావు మాట్లాడుతూ నన్ను నమ్మి, ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన నాలుగు రాష్ట్రాల అయ్యప్ప భక్తులందరికీ హృదయపూర్వక నమస్కారాలు అని వారు తెలిపారు. అఖిల భారత అయ్యప్ప చిన్ముద్ర సేవా ట్రస్ట్ మరియు తత్వమసి సేవా సమాజం, తెలంగాణ సంయుక్త ఆధ్వర్యంలో ఈ అయ్యప్ప మహా అన్నప్రసాద కార్యక్రమం ప్రారంభమైంది. తేదీ 16 నవంబర్ నుండి 20 జనవరి 2026 వరకు వట్టప్పారా వేదికగా ఈ సేవ నిరంతరాయంగా కొనసాగుతుంది. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు అయ్యప్ప స్వాములకు అన్న మహాప్రసాదం అందజేయ బడుతుంది. 
ఈ మహత్తర కార్యక్రమానికి పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ పట్టణానికి చెందిన సదాశివుని రుద్ర కోటేశ్వరరావు తన వంతు ఆర్థిక సహాయం అందించడమే కాక, 4 రాష్ట్రాల నుంచి అయ్యప్ప స్వాములు కూడా ఈ ట్రస్ట్‌కు ఆర్థిక సహాయం అందించే విధంగా విశేష కృషి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అయ్యప్ప స్వాములకు దీక్షా కాలంలో మహా అన్న ప్రసాదం అందించే కార్యక్రమంలో పాలుపంచుకోవడం చాలా సంతృప్తినిచ్చిందని ఉమా రుద్ర కోటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికీ అయ్యప్ప స్వామి ఆశీస్సులు  లభిస్తాయని ఆయన పేరుకున్నారు.

Post a Comment

0 Comments