పాలకొండ సత్య సాయి మందిరంలో ఘనంగా 'చండీయాగం'

పాలకొండ, నవంబర్ 18 (మంగళవారం, 2025):
పాలకొండ పట్టణంలోని శ్రీ సత్య సాయి బాబా వారి మందిరంలో, బాబా వారి శత జయంతి వేడుకలను పురస్కరించుకుని ఈరోజు (18.11.2025) 'చండీయాగం' అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించబడింది.ఈ పవిత్రమైన చండీయాగాన్ని నీలమ్మ కాలనీకి చెందిన వారణాసి కుమారస్వామి దంపతులు తమ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ యాగానికి సంబంధించిన కార్యక్రమాలను జోషుల ఆంజనేయ శర్మ గారు నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన చండీయాగంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాయి ఆశీస్సులు అందుకున్నారు. సమితి సభ్యులు మాట్లాడుతూ, భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి శత జయంతి వేడుకలను తమ ప్రాంతంలో ఘనంగా నిర్వహిస్తామని తెలియజేశారు.

Post a Comment

0 Comments