భామినిలో ప్రత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నిమ్మక జయక్రిష్ణ

 పాలకొండ వెబ్ న్యూస్: భామిని, నవంబర్ 17, 2025:  మండలంలో, స్థానిక ఫుడ్ కార్పొరేషన్ గోడౌన్ సమీపంలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రత్తి కొనుగోలు కేంద్రాన్ని పాలకొండ నియోజకవర్గ శాసనసభ్యులు నిమ్మక జయక్రిష్ణ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మక జయక్రిష్ణ మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడూ రైతులకు అండగా ఉంటుందని, వారికి వారి పంటలకు గిట్టుబాటు ధర లభించేలా చూస్తుందని హామీ ఇచ్చారు. ఈ కేంద్రం ద్వారా భామిని మండల రైతులకు ప్రత్తి పంటకు సరైన మద్దతు ధర లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ  కార్యక్రమంలో పాలకొండ AMC చైర్మన్ బిడ్డిక సంధ్యారాణి, AMC డైరెక్టర్లు మరియు వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment

0 Comments