భారత రాజ్యాంగ దినోత్సవం: డా. బి.ఆర్. అంబేద్కర్ గారికి ఘన నివాళి

పాలకొండ వెబ్ న్యూస్: నవంబర్ 26:
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాలకొండ నగర పంచాయతీ కార్యాలయంలో బుధవారం ఘనంగా వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్కి పాలకొండ నగర పంచాయతీ కమిషనర్ రతన్ రాజు నివాళులర్పించారు.
నగర పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి మరియు ఆయన ఫోటోకు కమిషనర్ రతన్ రాజు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని, ప్రాముఖ్యతను ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మెప్మా సిబ్బంది, నగర పంచాయతీ సిబ్బందితో పాటు, సచివాలయం సిబ్బంది కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్కి నివాళులర్పించారు.

Post a Comment

0 Comments