పాలకొండ జిల్లా పోరాటం: రెండవ రోజు రిలే దీక్ష!

 


కళాభారతి న్యూస్ (పాలకొండ వెబ్ న్యూస్) : పాలకొండ రెవెన్యూ డివిజన్‌ను జిల్లా చేయాల్సిందే. లేదంటే శ్రీకాకుళం జిల్లాలో కలపాలి. పాలకొండ ప్రజల ఏకైక డిమాండ్‌ ఇది. ఈ డిమాండ్‌ సాధన కోసం పాలకొండ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష కొనసాగుతోంది. శనివారం (నవంబర్ 1, 2025) ఈ దీక్ష రెండవ రోజుకు చేరింది.  

పాలకవర్గం గుర్తించాలి: సామంతుల దామోదరావు

  • టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ జడ్పీటీసీ సభ్యులు సామంతుల దామోదరావు దీక్షలో పాల్గొని మద్దతు పలికారు. "పాలకొండ పాత రెవెన్యూ డివిజన్‌ను జిల్లా చేయాలనే కోరిక ప్రజల హృదయాల నుంచి వచ్చింది. పాలకవర్గం దీనిని గుర్తించాలి" అని ఆయన డిమాండ్ చేశారు. పాలన సౌలభ్యం, భౌగోళిక పరిస్థితులు, సామాజిక సంబంధాలు పాలకొండకు అనుకూలంగా ఉన్నాయి.
  • వ్యవసాయ ప్రాంతమైన ఈ పాత డివిజన్‌ నేడు వెనుకబడి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాకు కావలసిన అన్ని అర్హతలు పాలకొండకు ఉన్నాయని దామోదరావు స్పష్టం చేశారు.లేదా శ్రీకాకుళంతో కలపాలని ప్రభుత్వాన్ని కోరారు. 

ప్రజల గుండెచప్పుడు విస్మరించవద్దు 


  • మార్క్ ఫెడ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్, తూర్పు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు అనెపు రామకృష్ణ కూడా డిమాండ్‌కు మద్దతు తెలిపారు.పాలకొండ జిల్లా సాధన సమితి అధ్యక్షులు బుడితి అప్పలనాయుడు మాట్లాడారు. పాలకొండ ప్రాంత ప్రజల గుండెచప్పుడును పాలకులు విస్మరిస్తే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. పాలకొండను జిల్లా చేయడమో లేదా శ్రీకాకుళం జిల్లాలో కలపడమో న్యాయసమ్మతమైన డిమాండ్ అని అన్నారు.

🤝 మద్దతు తెలిపిన ప్రముఖులు 


రెండవ రోజు దీక్షకు పలువురు నాయకులు, సంఘాల ప్రతినిధులు మద్దతు ప్రకటించారు. దీక్షాపరులు: ప్రెస్ క్లబ్ గౌరవ అద్యక్షులు జొన్నలగడ్డ  కామేశ్వరరావు, ఆర్.ఎం.పి డాక్టర్ యూనియన్ నాయకులు పి. రామి  నాయుడు, వండాన కూర్మారావు, దుంపల రమేష్ (చిన్ని), దుప్పాడ ఈశ్వరరావు, ఎస్. సంగీతరావు, డి. గణపతీ స్వరావు. మద్దతు పలికినవారు: ఎం. సింగపురం సర్పంచ్ రణస్థలం రాంబాబు, కొండాపురం సర్పంచ్ ప్రతినిధి రామకృష్ణ, టీడీపీ నాయకులు గుమ్మడి సింహాద్రి, వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షులు వెలమల మన్మధరావు. సంఘ నాయకులు: రెల్లి కులస్తుల సంఘం నాయకులు బాబ్జీ, అప్పన్న, బట్టలు వర్తక సంఘం ప్రతినిధులు గుడ్ల సత్యనారాయణ, శిల్లా పకీరు, బల్ల రాము, రెల్లి సంఘం యూత్, శ్రీకాకుళం జిల్లా మేధావులు ఫారం నాయకులు సూరంగి మోహన్ రావు. ఇతరులు: ఉద్యోగస్తుల సంఘం నాయకులు కిల్లారి నారాయణరావు, జిల్లా విశ్రాంతి కోశాధికారి తవిటన్న, వాల్లె శ్రీములు నాయుడు (అంబేద్కర్ యూనివర్సిటీ), అంపిలి గోపాలకృష్ణ (పోస్టల్ శాఖ విశ్రాంతి ఉద్యోగి), వావిలపల్లి గోవిందరావు (విశ్రాంతి ఉపాధ్యాయులు), పాలకొండ ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు జొన్నలగడ్డ కామేశ్వరరావు, అధ్యక్షులు వల్లూరు సత్యనారాయణ మరియు పాత్రికేయులు భాసురు శివశంకర్ ప్రసాద్, ఎస్.కె శివప్రసాద్, బాసూరు కాంతారావు, యామల ఈశ్వరరావు, ఆర్ రవి, మండల గణేష్ నాయుడు, ఆర్ సత్యనారాయణ, రేగులవలస సురేష్, ఆర్ చంటి,  ఎన్.  వంశీ, దాసిరెడ్డి మధుసూదన్ రావు, బీసీ నాయుడు మరియు తదితరులు పాల్గొని పాల్గొన్నారు. 

🍋 యువ డాక్టర్ చేతుల మీదుగా దీక్ష విరమణ : రిలే నిరాహారదీక్షను యువ డాక్టర్, జనరల్ మెడిషన్ ఎం.డి. (ఢిల్లీ ఎయిమ్స్) తుమ్మగుంట గోపీనాథ్ నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. 


                                                         News by : BSS Prasad.

 

Post a Comment

0 Comments