పార్వతీపురం మన్యం జిల్లా భామినిలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం పర్యటించారు. మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ (Mega PTM 3.0)లో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రి, భామిని ఆదర్శ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో రూపొందించిన ప్రాథమిక నమూనా తరగతి గదిని ముఖ్యమంత్రితో పాటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా పరిశీలించారు. తరగతి గదిలో బోధన, తదితర అంశాలపై విద్యార్థుల మధ్య కూర్చొని ముఖ్యమంత్రి మరియు మంత్రి లోకేష్ ముచ్చటించి, వారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు.
అనంతరం, భామిని ఏపీ మోడల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాల ప్రాంగణంలో జరిగిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ (Mega PTM 3.0) కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ సభలో ముఖ్యమంత్రి శ నారా చంద్రబాబు నాయుడు, విద్యా శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ మరియు పాలకొండ నియోజకవర్గ శాసనసభ్యులు శ నిమ్మక జయక్రిష్ణ పాల్గొన్నారు. వీరు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయక్రిష్ణ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థలో రాబోయే కాలంలో ఎవ్వరూ ఊహించని అద్భుతమైన ఫలితాలు వస్తాయని, దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అలాగే, ఈ అద్భుతమైన మీటింగ్‌ను విద్యార్థులు చాలా బాగా నిర్వహించారని ప్రశంసించారు. రాబోయే మూడేళ్లలో 'ఆంధ్రా స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్' తీసుకువస్తానని విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలియజేశారు.
0 Comments