ఎన్.కె. రాజపురం ప్రాథమిక పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్

పాలకొండ వెబ్ న్యూస్: ఎన్.కె. రాజపురం ప్రాథమిక పాఠశాల ఆవరణలో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ 3.0 కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలకు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, SMC సభ్యులు, సమాజం అంతా సహకరించి పాఠశాలలో జరిగే విషయాలు, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు తెలియజేయడానికి ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని హెచ్ఎం. శాసపు వాసుదేవరావు తెలియజేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న SMC చైర్ పర్సన్ నీలాపు మణి, నీలాపు అప్పారావు నాయుడు గారు, నీలాపు శ్రీనివాసరావు కౌన్సిలర్, నీలాపు సూర్యనారాయణ మాజీ ఎంపీటీసీ, రిటైర్డ్ ఉపాధ్యాయులు పక్కి నందయ్య మరియు ఇతర పెద్దలు మాట్లాడుతూ మెగా పేరెంట్స్ మీటింగ్‌లు పిల్లల అభివృద్ధికి ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రభుత్వ బడులలో చదవడం వలన పిల్లలు ఎంతో ఉన్నత స్థాయికి చేరుకుంటారని, కాబట్టి తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్స్‌కి వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయవలెనని కోరారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహోపాధ్యాయురాలు బెవర గాయత్రి, జడ్డు జోగి నాయుడు, సుంకరి సూర్యారావు, వెంకటరమణ గారు, ఉర్లంకుల నారాయణరావు గారు, ఎస్ఎంసి వైస్ చైర్ పర్సన్ శనగల లలిత, కడగల సాంమూర్తి, పిల్లల తల్లిదండ్రులు, వంట నిర్వాహకులు, ఆయా ధనలక్ష్మి, వైద్య సిబ్బంది, సచివాల సిబ్బంది చురుకుగా పాల్గొని మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ను విజయవంతం చేశారు.

Post a Comment

0 Comments