ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా, శుక్రవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలురు) లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం 'మెగా పేరెంట్స్ మీటింగ్ 3.0' పేరుతో ఘనంగా నిర్వహించబడింది.
ఉదయం 9 గంటలకే తల్లిదండ్రులు, అతిథులు, పూర్వ విద్యార్థులు మరియు అధికారులు కళాశాలకు చేరుకోగా, వారికి కళాశాల సిబ్బంది సాదర స్వాగతం పలికారు. ముందుగా తరగతి గదుల్లో తల్లిదండ్రులకు వారి విద్యార్థుల ప్రగతి నివేదికను ఉపాధ్యాయులు వివరించారు. త్వరలో జరగబోయే పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులను ఏ విధంగా సన్నద్ధం చేయాలనే దానిపై విలువైన సూచనలు చేశారు. అదేవిధంగా, తరగతి గదిలో మానసిక ఆరోగ్యం, నైపుణ్య విద్య మరియు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాల్సిన ఆవశ్యకతకు సంబంధించిన విషయాలను వీడియోల ద్వారా ప్రదర్శించారు.
ఉదయం 11 గంటలకు సభా కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సమావేశానికి కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ వి. హర గోపాల్ గారు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ గారు మాట్లాడుతూ, కళాశాలలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల గురించి వివరించారు. ముఖ్యంగా, రాబోయే పబ్లిక్ పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత సాధించడం కోసం కళాశాల తీసుకుంటున్న చర్యల గురించి మరియు కళాశాల సమగ్ర ప్రగతి నివేదికను తల్లిదండ్రులకు వివరించారు.
ఈ సమావేశానికి కళాశాల పూర్వ విద్యార్థులు, సీతంపేట డిగ్రీ కళాశాల మ్యాథమెటిక్స్ లెక్చరర్ శ్రీ ఎస్. రవికుమార్ మరియు బొబ్బిలి ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న పి. చిన్నం నాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తమ అమూల్యమైన సందేశాలతో వీరు విద్యార్థులను ఉత్తేజపరిచారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన పి. చిన్నం నాయుడు గారు తన తాతయ్య నానమ్మల పేరిట ఒక గొప్ప ప్రకటన చేశారు. పబ్లిక్ పరీక్షల్లో ప్రథమ స్థానం పొందిన విద్యార్థికి ₹10,000, ద్వితీయ స్థానం పొందిన విద్యార్థికి ₹5,000 చొప్పున బహుమతి అందజేస్తానని సభాముఖంగా తెలియజేశారు.
0 Comments