పాలకొండ వెబ్ న్యూస్: ఓని పాఠశాలలో 'మెగా పేరెంట్ టీచర్ మీటింగ్

పాలకొండ వెబ్ న్యూస్: : మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల, ఓని గ్రామంలో ఈరోజు 'మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0' (తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం) జరిగింది. ఈ సమావేశానికి ప్రధానోపాధ్యాయిని శ్రీమతి బి. సునీత అధ్యక్షత వహించగా, విద్య కమిటీ చైర్మన్ శ్రీమతి ఎమ్. స్రవంతి పాల్గొన్నారు. విసిస్ట అతిథులు  ఎం. అప్పలనాయుడు, ఎం. రంగారావు, ఎస్. ఆశిరయ్య పాల్గొన్నారు.   ఉపాధ్యాయులు భాసూరు శ్రీనివాసరావు, పుష్పలత, పి. సురేష్ కూడా ఈ కార్యక్రమంలో భాగమయ్యారు. తెలుగు తల్లి ప్రార్థనతో ప్రారంభమైన ఈ సమావేశంలో మండల ప్రజా పరిషత్తు ఉపాధ్యక్షులు కనపాక సూర్యప్రకాశరావు మాట్లాడుతూ, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని, పాఠశాలలో నేర్పే చదువు పిల్లల అభివృద్ధి దాయకం గా ఉండాలని తెలిపారు. ముందుగా తల్లిదండ్రులకు, పెద్దలకు స్వాగతం పలికిన తదుపరి, విద్యార్థిని విద్యార్థుల క్లాసులవారీగా వారి యొక్క హోలాస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు అందజేశారు. అనంతరం, పాఠశాల విద్యా పురోగతిపై ప్రధానోపాధ్యాయిని నివేదికను చదివి వినిపించారు. విద్యార్థులు తమ సాంస్కృతిక కార్యక్రమాలను, పద్యాలు చెప్పడంలోనూ తమ ప్రతిభను కనబరిచారు.వక్తలు నాణ్యమైన విద్య, పిల్లల ప్రగతికి క్రమశిక్షణ ఎంత అవసరమో పేర్కొన్నారు. టీచర్లు తమ సందేశంలో గ్యారెంటీ ఎఫ్ఎల్‌ఎన్ లక్ష్యాలు సాధించడానికి కృషి చేస్తామని, ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తామని పేర్కొన్నారు. చివరగా, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అతిథులు, గ్రామ పెద్దలు, విద్యార్థిని విద్యార్థులు అందరూ కలిసి డొక్కా సీతమ్మ మధ్యాహ్న సహాపంక్తి భోజనం చేశారు.

Post a Comment

0 Comments