నేడు భామిని చేరుకోనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

 పాలకొండ వెబ్ న్యూస్ : శుక్రవారం, డిసెంబరు 5, 2025 నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్ గారు భామినిలో పర్యటించనున్నారు. ఉదయం 10:20 గంటలకు ముఖ్యమంత్రి హెలికాప్టర్‌లో భామిని చేరుకుంటారు. భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం, భామిని ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాల ఆవరణలో జరగనున్న మెగా పేరెంట్, టీచర్ సమావేశానికి ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా విద్యార్థులకు తెలుగు, ఆంగ్లం, గణితంలో కనీస సామర్థ్యం హామీ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
ముఖ్యమంత్రి, లోకేశ్‌తో కలిసి 10:50 నుండి 11:55 వరకు పాఠశాలలో ప్రయోగశాలలు, స్పోర్ట్స్ గ్రౌండ్ సందర్శించి, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశమై ఫొటో సెషన్‌లో పాల్గొంటారు. అనంతరం, మధ్యాహ్నం 12:00 గంటల నుండి ప్రజావేదిక వద్ద జరిగే సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కోన శశిధర్ పాఠశాల విద్యా కమిషనర్ విజయరామరాజు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు తెలుగుదేశం పార్టీ అరకు పార్లమెంట్ ఇన్చార్జి డిసిసి చైర్మన్ శ్రావణ్ కుమార్ పాలకొండ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి పడాల భూదేవి తదితరులు పాల్గొని అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు 
మరోవైపు, సీఎం పర్యటన కారణంగా సీతంపేట ఐటీడీఏలో నిర్వహించే ప్రజా సమస్యల రద్దు చేశారు. విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్, ఎస్పీ మాధవరెడ్డి భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Post a Comment

0 Comments