(పాలకొండ వెబ్ న్యూస్): విజయనగరం-పాలకొండ ప్రధాన రహదారిలో చీపురుపల్లి వద్ద నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబీ) పనులను సంక్రాంతిలోగా పూర్తి చేసి ప్రారంభిస్తామని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు తెలిపారు. బుధవారం వంతెన తుది దశ పనులను ఆయన స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ వంతెన పనులు నత్తనడకన సాగాయని విమర్శించారు. దీనివల్ల గత నాలుగేళ్లుగా ఉత్తరాంధ్ర ప్రజలు, ముఖ్యంగా పాలకొండ నుంచి విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైల్వే, ఆర్ అండ్ బీ అధికారులతో నిరంతరం సమీక్షలు నిర్వహించి పనులను వేగవంతం చేశామన్నారు. ఈ వంతెన అందుబాటులోకి వస్తే పాలకొండ నుండి చీపురుపల్లి మీదుగా విశాఖపట్నం వెళ్లే వారికి ప్రయాణ కష్టాలు తీరుతాయని ఆయన పేర్కొన్నారు.
0 Comments