నడుకూరులో రీ-సర్వే పనుల తనిఖీ: సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్

 (పాలకొండ వెబ్ న్యూస్): వీరఘట్టం మండలంలోని నడుకూరు గ్రామంలో జరుగుతున్న భూ రీ-సర్వే పనులను సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ బుధవారం క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సర్వే రికార్డులను పరిశీలించి, పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  భూ రీ-సర్వే పకడ్బందీగా జరగాలని, ఎక్కడా అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఈ తనిఖీలో వీరఘట్టం తహశీల్దార్ మరియు ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

0 Comments