ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వారందరికీ ఏప్రిల్ 1వ తేదీ నుండి ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి సవిత శాసనమండలి వేదికగా ప్రకటించారు. ఈ పథకం ద్వారా మగ్గం కలిగిన నేతన్నలకు ప్రతి నెలా 200 యూనిట్ల వరకు, మర మగ్గం కలిగిన వారికి 500 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా లభిస్తుంది. ప్రభుత్వ నిర్ణయం వల్ల మగ్గం నేతన్నలకు ఏడాదికి రూ.8,640 వరకు, మర మగ్గం నేతన్నలకు రూ.21,600 వరకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని మంత్రి వివరించారు. అర్హులైన నేతన్నలందరికీ ఈ ప్రయోజనం చేకూరుతుందని, ఈ చర్యతో నేతన్నల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
0 Comments