కూటమి ప్రభుత్వంతోనే పల్లెల్లో ప్రగతి: గర్భాన సత్తిబాబు

పాలకొండ వెబ్ న్యూస్: కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్, జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు గర్భాన సత్తిబాబు తెలిపారు. ఈరోజు పాలకొండ మండలం నవగాం నుంచి జంపరకోట వరకు నూతనంగా నిర్మించిన రోడ్డును ఆయన పరిశీలించారు. అనంతరం ప్రజలతో మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ చొరవతో, ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో నవగాం నుంచి పొట్లి, RBR పేట, డోలమడ, ఎంసింగుపురం, బడ్డుమాసింగి మీదుగా సుమారు 9 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డును 2 కోట్ల 80 లక్షల రూపాయల వ్యయంతో పూర్తి చేసినట్లు వివరించారు. గత 15 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని ఈ రహదారులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్మించడం శుభపరిణామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధిపై హర్షం వ్యక్తం చేస్తూ గ్రామ ప్రజలు పవన్ కళ్యాణ్, నిమ్మక జయకృష్ణకు ధన్యవాదాలు తెలిపారు.

Post a Comment

0 Comments