పాలకొండ వెబ్ న్యూస్: పాలకొండ మున్సిపల్ పరిధిలో సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ విస్తృతంగా పర్యటించి పారిశుధ్య పనులను పరిశీలించారు. పట్టణంలోని చెత్త సేకరణ, నిర్వహణపై మున్సిపల్ సిబ్బందికి మరియు స్థానిక ప్రజలకు ఆయన పలు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా ప్రతి వీధిలో ప్రజలతో కలిపి వీధి కమిటీలను ఏర్పాటు చేయాలని, ఆ కమిటీల ద్వారా నిరంతరం వీధుల శుభ్రతపై చర్చించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం పాలకొండ ఆర్.టి.సి బస్టాండ్‌ను తనిఖీ చేసిన సబ్ కలెక్టర్, అక్కడ ప్రయాణికులకు అందుబాటులో ఉన్న త్రాగునీరు మరియు టాయిలెట్ల సౌకర్యాలను స్వయంగా పరిశీలించారు. బస్టాండ్ ఆవరణలో పరిశుభ్రత విషయం లో నిత్యం శుభ్రంగా ఉంచేలా చూడాలని ఆర్.టి.సి సిబ్బందికి మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రజారోగ్యం దృష్ట్యా పారిశుధ్య విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించకూడదని ఆయన స్పష్టం చేశారు.
0 Comments