పాలకొండ వెబ్ న్యూస్: అమరావతి సచివాలయంలో 114వ ఆంధ్రప్రదేశ్ గిరిజన సలహా మండలి సమావేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగింది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై కీలక చర్చలు జరిపారు. ఈ కార్యక్రమంలో పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయక్రిష్ణ పాల్గొని గిరిజనుల సంక్షేమం, విద్య, వైద్యం మరియు మౌలిక సదుపాయాల కల్పనపై గళం విప్పారు. గిరిజన అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వారు ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ పలు సూచనలు చేశారు.
0 Comments