పాలకొండ వెబ్ న్యూస్, ఫిబ్రవరి 12: పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని శిర్లిపోతన్న వీధి ఆధ్యాత్మిక వేడుకకు సిద్ధమవుతోంది. భక్తుల పాలిట కల్పవల్లిగా కొలువుదీరిన శ్రీ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో, ఈ ప్రాంత ఆరాధ్య దైవం శ్రీ శిర్లిపోతన్న స్వామి వారి యాత్ర మహోత్సవం ఈనెల 24వ తేదీ (మంగళవారం) అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.
కార్యక్రమ వివరాలు:
తేదీ: 24-02-2026, మంగళవారం.
వేదిక: శిర్లిపోతన్న వీధి, పాలకొండ.
విశేషం: ఈనెల 23వ తేదీ సోమవారం స్వామివారికి కుంకుమ పూజలు, హోమం, అన్న ప్రసాద కార్యక్రమం జరుగును. అదే రోజు సాయంత్రం 6:30 గంటలకు శ్రీ స్వామి వారి తిరువీధి కార్యక్రమం కూడా జరుగుతుందని రాత్రి 9 గంటలకు స్వామివారి చరిత్ర బైరిపురం వారిచే జమికుల పాట బుర్రకథ రూపంలో చెప్పబడునని తెలిపారు స్వామి వారికి ప్రత్యేక పూజలు, అలంకరణలు నిర్వహించ నున్నట్లు కమిటీ చైర్మన్ కొల్లి చెల్లంనాయుడు (భీమ) మరియు కమిటీ సభ్యులు తెలిపారు
భక్తులకు ఆహ్వానం
"భక్తులపాలిటి కల్పవల్లి శ్రీ యల్లమ్మ తల్లి" కృపాకటాక్షాలతో జరిగే ఈ పుణ్యకార్యంలో భక్తులందరూ పాల్గొని, స్వామి వారి కృపకు పాత్రులు కావాలని ఉత్సవ కమిటీ సభ్యులు కోరుతున్నారు.
చరిత్ర: పాలకొండ శిర్లిపోతన్న వీధిలో "యల్లమ్మ జాతర" గత శతాబ్దాలకాలం నుండి చేస్తున్నట్లు పెద్దలు చెబుతున్నారు. ప్రతీ సంవత్సరం ఈ జాతర జరుపుటకు మహాశివరాత్రి తరువాత 5 రోజులు యల్లమ్మ జంగిడి తలపై పెట్టుకొని వీధుల్లో ప్రతి ఇంటికి వెళ్తారు. ప్రజలు భక్తి శ్రద్ధలతో యల్లమ్మను పూజించి జోగివేస్తారు. ఈ విధంగా నాలుగు దినములు పాటించి ఐదవ రోజు రాత్రి జాగారాలు నిర్వహిస్తారు. ఆ జాగారాల్లో యల్లమ్మ చరిత్ర "జమికలపాట" రూపంలో ప్రజలకు మరొకసారి తెలియజేయుదురు.
ప్రతీ సంవత్సరం మహాశివరాత్రి తరువాత వచ్చే అష్టమి తిధి రోజున ఈ జాతర జరుపబడును మరియు "సింధూరం కుండ" పంట కార్యక్రమమే ఈ జాతర. ఈ జాతర అనంతరం పాల జంగిడి ప్రదర్శన ఎంతో మోక్షం కలిగిస్తుందని భక్తుల నమ్మకం.
కన్నులపండువగా ఉత్సవాలు
ప్రతీ ఏటా నిర్వహించే ఈ యాత్రను ఈసారి మరింత ఆధ్యాత్మిక చింతనతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు స్థానికులు మరియు ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. స్వామి వారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారని భావిస్తున్నారు.
0 Comments