పాలకొండ వెబ్ న్యూస్: రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించి 12వ పీఆర్సీ కమిటీని ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని పిడీఎఫ్ ఎమ్మెల్సీ ఐ.గోపీమూర్తి డిమాండ్ చేశారు. గురువారం శాసనమండలిలో ప్రత్యేక ప్రస్తావన ద్వారా ఈ అంశాన్ని సభ దృష్టికి తీసుకువచ్చిన ఆయన, ఐదేళ్ల ఆర్థిక ప్రయోజన కాలంలో ఇప్పటికే రెండు సంవత్సరాల ఎనిమిది నెలల కాలం వృథా అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించాలని మరియు పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేయాలని కోరారు.
దీనితో పాటు 11వ పీఆర్సీ అరియర్స్, సరెండర్ లీవులు వంటి పర్సనల్ బెనిఫిట్ బకాయిలను వెంటనే చెల్లించాలని పేర్కొన్నారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పెండింగ్‌లో ఉన్న టీఏ, సరెండర్ లీవ్స్ తదితర ఆర్థిక బకాయిలను కూడా పరిష్కరించాలని గోపీమూర్తి ప్రభుత్వాన్ని కోరారు.
0 Comments