పాలకొండ వెబ్ న్యూస్: దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తయిన తర్వాతే 2029లో జమిలి ఎన్నికలు అవకాశం ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలోని తన అధికార నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 2027 మార్చి నాటికి జనగణన పూర్తి చేసి, ఆపై రెండు నెలల్లో కేంద్ర ప్రభుత్వం లెక్కలను వెల్లడిస్తుందని వివరించారు. అనంతరం నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ ఏర్పాటవుతుందని, ఏడాది కాలంలో సీట్ల పెంపుతో పాటు మహిళా రిజర్వేషన్ల ప్రక్రియ కొలిక్కి వస్తుందని తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీకి 2028లో ఎన్నికలు రావని, 2029 జమిలి ఎన్నికలతోనే కలిపి నిర్వహిస్తారని పేర్కొన్నారు. దీనివల్ల తన పదవీకాలం ఐదున్నరేళ్లు ఉంటుందని రేవంత్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
0 Comments