పాలకొండ వెబ్ న్యూస్:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పెన్షన్ విధానంలో కీలక మార్పులు ప్రతిపాదిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘నూతన పెన్షన్ రూల్స్–2026’ ముసాయిదాపై రిజిస్టర్డ్ సంఘాల నుంచి కూడా అభిప్రాయాలు తీసుకోవాలని ఏపీ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయ్ భాస్కర్, ప్రధాన కార్యదర్శి నాగమునెయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముసాయిదాలోని కొన్ని అంశాలు ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో ఆందోళనకు కారణమవుతున్నాయని వారు తెలిపారు. 33 సంవత్సరాల గరిష్ట అర్హత సేవ పరిమితి విధించడం వల్ల ఎక్కువ కాలం సేవ చేసిన వారికి పెన్షన్‌లో అదనపు లాభం లేకుండా పోతుందన్నారు. ఒకవైపు 33 సంవత్సరాల సేవ పూర్తయిన వెంటనే తప్పనిసరిగా విరమణ అవసరం లేదని చెబుతూనే ప్రజాప్రయోజనం పేరిట నియామక అధికారికి ఉద్యోగిని విరమణ చేయించే అధికారం ఇవ్వడం వివాదాస్పదమని పేర్కొన్నారు.
0 Comments