ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికలు: పాలకొండలో 98 శాతం పోలింగ్


పాలకొండ వెబ్ న్యూస్: రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు పాలకొండలో ప్రశాంతంగా ముగిశాయి. స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో పాలకొండ న్యాయవాదుల సంఘం అధ్యక్షులు శామ్యూల్ ఆధ్వర్యంలో ఈ ఎన్నికల ప్రక్రియను నిర్వహించారు. రాష్ట్రస్థాయిలో మొత్తం 143 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, పాలకొండ నియోజకవర్గ పరిధిలోని సుమారు డెబ్భై మంది న్యాయవాదులు అత్యంత ఉత్సాహంతో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఈ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో న్యాయవాదులు గోవిందరాజు, రామ్మోహన్, మురళీమోహన్, కే. వెంకరమణ, నరసింహారావు, డి. ఆనంద్ తదితరులు పాల్గొని ఓటు వేశారు. న్యాయవాదుల సంక్షేమం మరియు కౌన్సిల్ బలోపేతం కోసం అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చే ఈ ఎన్నికలు పారదర్శకంగా సాగాయి. ఓటింగ్ ముగిసిన అనంతరం న్యాయవాదుల సంఘం ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు.

 న్యూస్ బై.. టి. సింహాచలం, లీగల్ కరస్పాండెంట్

Post a Comment

0 Comments