ఘనంగా పల్సస్ సీఈఓ గేదెల శ్రీనుబాబు జన్మదిన వేడుకలు

పాలకొండ వెబ్ న్యూస్: సామాజిక వేత్త, పల్సస్ సీఈఓ మరియు సత్య సాయి విద్యాసంస్థల చైర్మన్ గేదెల శ్రీనుబాబు జన్మదిన వేడుకలు శనివారం పాలకొండలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యసాయి విద్యాసంస్థల కరస్పాండెంట్ దూబ వెంకటరమణ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. పాలకొండ ఏరియా ఆసుపత్రి మెడికల్ సూపరిండెంట్ డాక్టర్ కె చిరంజీవి పర్యవేక్షణలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగా, యువత మరియు దాతలు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం స్థానిక ఏరియా ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, రొట్టెలను పంపిణీ చేసి తమ ఉదారతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో సత్య సాయి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఏ శ్రీనివాసరావుతో పాటు విద్యాసంస్థల అధ్యాపకులు, ఉపాధ్యాయులు మరియు సిబ్బంది పాల్గొని శ్రీనుబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Post a Comment

0 Comments