పాలకొండ వెబ్ న్యూస్: స్థానిక వడ్డాది వారి వీధిలో గల ఎలైట్ కాలేజీ ఆవరణలో శనివారం ఉదయం ప్రముఖ కవి, రచయిత మరియు జర్నలిస్టు సంఘాల నాయకుడు కామ్రేడ్ నల్లి ధర్మారావుకు ఘనంగా సత్కారం జరిగింది. పాలకొండ పట్టణ పూర్వపు మిత్ర బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ అభినందన కార్యక్రమంలో అభ్యుదయ భావాలు కలిగిన ధర్మారావు సేవలను పలువురు వక్తలు కొనియాడారు. రాష్ట్ర మరియు జాతీయ స్థాయి జర్నలిస్టు సంఘాల్లో నాయకుడిగా ఆయన అందించిన పోరాట పటిమను, సమాజ శ్రేయస్సు కోసం ఆయన కలం పట్టిన తీరును ఈ సందర్భంగా ప్రస్తావించారు. జర్నలిజం రంగానికి ఆయన దిశానిర్దేశం చేస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని అభినందించారు. ఈ కార్యక్రమంలో మిత్ర బృందం సభ్యులు మరియు ప్రముఖులు పాల్గొని ధర్మారావును ఘనంగా సన్మానించారు.
1 Comments
హార్దిక అభినందనలు మిత్రమా 1980నుంచి అంటే పాలకొండ డివిజన్ పరిధిలో ఈనాడు విలేఖరి గా ఉన్న నాటి నుంచి నేటి వరకు ధర్మారావు నాకు మంచి మిత్రులు వారు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఇతోధికంగా పత్రికా సంపాదకులు గా మంచిపేరు మన పాలకొండ కుతేవాలనీ మనః పూర్వకంగా కోరుతూ గాడ్ బ్లస్ యూ సోదరా
ReplyDelete