పాలకొండ వెబ్ న్యూస్: ఉత్తర కోస్తా ప్రాంతంలోని విజయనగరం జేఎన్టీయూ గురజాడ విశ్వవిద్యాలయం ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలపై ఈరోజు శాసన మండలి సమావేశంలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా విక్రాంత్ మాట్లాడుతూ యూనివర్సిటీలో నెలకొన్న తీవ్ర సిబ్బంది కొరత, నిధుల లేమిపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. ఈ విశ్వవిద్యాలయంపై సుమారు 36 అనుబంధ కళాశాలలు ఆధారపడి ఉన్నాయని, విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా దీనిని బలోపేతం చేయడం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా కాకినాడ జేఎన్టీయూ నుంచి ఈ యూనివర్సిటీకి రావాల్సిన నిధులను తక్షణమే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని విక్రాంత్ విజ్ఞప్తి చేశారు. వీటితో పాటు కురుపాం ట్రైబల్ ఇంజనీరింగ్ కళాశాలను ఇదే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించి గిరిజన ప్రాంత విద్యార్థులకు సాంకేతిక విద్యను అందుబాటులోకి తీసుకురావాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
0 Comments