పాలకొండ వెబ్ న్యూస్: రైస్ మిల్లు కార్మికులకు సమగ్ర భద్రత సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఈఎస్ఐ, పిఎఫ్ సదుపాయాలు కల్పించాలని కోరుతూ పాలకొండలో నిర్వహించిన రైస్ మిల్స్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జనరల్ బాడీ సమావేశం డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ధావాల రమణారావు, యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు జి సత్యం, వై శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రాణాలకు తెగించి మూటలు మోస్తున్న కార్మికులకు పెరుగుతున్న ధరల ప్రకారం వేతనాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన కార్మికులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, అనారోగ్యం పాలైతే ఆదుకునే వ్యవస్థ లేదని వారు పేర్కొన్నారు. పాలకొండ మండలంలోని 8 మిల్లుల్లో పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాడ్యుటీ వంటి సౌకర్యాలు అమలు కావడం లేదని, 2026 జనవరి 1 నుంచి అమలు కావాల్సిన నూతన వేతన ఒప్పందంపై యాజమాన్యాలు కాలయాపన చేస్తున్నాయని విమర్శించారు. అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించకుంటే ఐక్య పోరాటాలకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాదా రాము, దూసి దుర్గారావు, వై సింహాచలం, సిహెచ్ స్వామి నాయుడు, గణ తదితరులు పాల్గొన్నారు.
0 Comments