యూపీఐ లావాదేవీలపై ఆర్‌బీఐ ప్రతిపాదన : రూ. 10,000 దాటితే గంట వేచి చూడాల్సిందే

పాలకొండ వెబ్ న్యూస్..తేదీ: 11 ఏప్రిల్, 2026:​డిజిటల్ చెల్లింపుల మోసాలను అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ప్రతిపాదనను తీసుకువచ్చింది. ఫోన్‌పే, గూగుల్ పే వంటి యాప్‌ల ద్వారా పది వేల రూపాయలకు పైబడిన నగదును ఒక వ్యక్తి నుంచి మరొకరికి పంపినప్పుడు అది వెంటనే జమ కాకుండా గంట సమయం పడుతుంది. సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్న వారిని కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. పొరపాటున నగదు పంపితే ఈ గంటలోపు లావాదేవీని రద్దు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే వ్యాపారులకు చేసే చెల్లింపులకు ఈ నిబంధన వర్తించదు. నమ్మకస్తులైన వారి ఖాతాలను వైట్‌లిస్టింగ్ చేసుకోవడం ద్వారా జాప్యం లేకుండా నగదు పంపుకోవచ్చు. మే 8 లోగా ఈ అంశంపై ప్రజలు తమ అభిప్రాయాలను తెలపాలని ఆర్‌బీఐ కోరింది.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments