నరసింహ చెరువు అభివృద్ధికి అధికారుల కసరత్తు: పనులు వేగవంతం చేయాలని రైతుల విజ్ఞప్తి

పాలకొండ వెబ్ న్యూస్, 10 ఏప్రిల్ 2026: పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం పిఆర్ రాజుపేట పరిధిలోని నరసింహ చెరువు అభివృద్ధి, ఆక్రమణల తొలగింపు దిశగా అడుగులు పడుతున్నాయి. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జలవనరుల శాఖ జేఈ భాస్కరరావు, ఐజీ పకీరు శుక్రవారం చెరువును సందర్శించి పరిశీలన చేపట్టారు. పద్మనాభ చెరువు పరిధిలో శిథిలావస్థకు చేరిన మదుములకు కొలతలు తీసి, సాగునీటి సరఫరాను మెరుగుపరిచేందుకు అంచనాలు రూపొందిస్తామని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాదరావు, ఇద్దుబోయిన సింహాద్రి మాట్లాడుతూ 15 రోజుల్లోగా పనులు ప్రారంభించి సాగునీటి ఇబ్బందులు తొలగించాలని కోరారు. ముఖ్యంగా 50 ఎకరాలకు పైగా నీరందించే మదుము వద్ద ఉన్న ఆక్రమణలను రెవెన్యూ శాఖ సహకారంతో తొలగించాలని విన్నవించారు. అనంతరం చెరువు గట్టు పటిష్టత కోసం పూడికతీత మట్టిని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments