పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని 2వ వార్డు రెల్లి వీధిలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. రెల్లి కులం అభివృద్ధి సేవా సంఘం అధ్యక్షుడు మజ్జి బాబ్జి (భూషణ్ రావు) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఏరియా హాస్పిటల్ సూపరెండెంట్ డాక్టర్ కే చిరంజీవి, తెలుగుదేశం పార్టీ టౌన్ అధ్యక్షుడు గుమ్మడి సింహాద్రి, అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి గంటా సంతోష్ కుమార్, మాజీ నగర పంచాయతీ చైర్ పర్సన్ ప్రతినిధి ఆకుల కుమార్, మాజీ కౌన్సిలర్ ప్రతినిధి కోలా లక్ష్మి పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా డాక్టర్ చిరంజీవి మాట్లాడుతూ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోసం, దేశాభివృద్ధి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. సమాజంలో అంటరానితనం నిర్మూలనకు, వివక్షపై ఆయన అలుపెరుగని పోరాటం చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు కొట్నాన అప్పన్న, డి రాజు, ఐ వంశీ, ఎస్ ప్రభు, పి ప్రభు, ఎస్ శ్రీను, కే త్రినాధ, పి ప్రకాశం, గణేషు, మజ్జి ప్రకాష్, ఐ చోటు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ముఖ్య అతిథులను నిర్వాహకులు శాలువాలతో ఘనంగా సత్కరించారు.
news by: BSS Prasad
0 Comments