పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్ లో చలివేంద్రం ప్రారంభం

పాలకొండ వెబ్ న్యూస్..తేదీ: 15-04-2026:​పాలకొండ పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాలకొండ ఏపీఎస్ ఆర్టీసీ డిపో మేనేజర్ మూర్తి మరియు నిత్య అన్నదాన పథకం గౌరవ అధ్యక్షులు పార్వతమ్మ విచ్చేశారు. వారు రిబ్బన్ కత్తిరించి ఈ సేవా కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రారంభోత్సవం సందర్భంగా ప్రయాణికులకు, ప్రజలకు మినరల్ వాటర్ తో పాటు మజ్జిగను పంపిణీ చేశారు. ఎండలు తీవ్రంగా ఉన్న దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఈ చలివేంద్రం జూన్ నెల వరకు నిరంతరాయంగా కొనసాగుతుందని గౌరవాధ్యక్షురాలు పార్వతమ్మ ఈ సందర్భంగా వెల్లడించారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా సేవా మార్గంలో ఈ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని అతిథులు కొనియాడారు. ఈ సేవా కార్యక్రమంలో సత్యసాయి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వచ్ఛందంగా సేవలు అందించారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments