రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలు చిరస్మరణీయం..ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్

పాలకొండ వెబ్ న్యూస్..తేదీ: 14-04-2026

​డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని యాలం జంక్షన్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు పాలవలస విక్రాంత్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విక్రాంత్ మాట్లాడుతూ అంబేద్కర్ సామాజిక, రాజకీయ హక్కుల కోసం జీవితాంతం పోరాటం చేశారని కొనియాడారు. దేశ రాజ్యాంగ వ్యవస్థాపన కోసం ఆయన ఎనలేని కృషి చేశారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ మున్సిపల్ కమిషనర్ ఎద్దు లిల్లీ పుష్పనాధం, కొంచాడ జాన్ మాస్టర్, పట్టణ అధ్యక్షులు వెలమల మన్మధరావు, కడగల వెంకటరమణ, తుమ్మగుంట శంకరరావు, భాసూరు కాంతారావు, బాబి, దుప్పాడ పాపి నాయుడు, కరణం శ్రీనివాసరావు, నాగరాజు, కాంతారావు, జర్జాన మోహన్, దుంపల చిన్ని, తిర్లంగి ఉపేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments