పాలకొండ పట్టణంలోని విజయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం ఉచిత సమ్మర్ స్పెషల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు బీపీ మరియు షుగర్ వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక పరీక్షలు చేయబడును. టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాలతో పాటు ఆస్తమా, కామెర్లు మరియు ఇతర జనరల్ వ్యాధులకు ఉచితంగా వైద్యం అందించనున్నారు. ఈ శిబిరంలో రేడియాలజిస్ట్ ద్వారా ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ తో పాటు వివిధ రకాల రక్త పరీక్షలు ఉచితంగా చేస్తారు. పాముకాటు మరియు అత్యవసర కేసులకు కూడా చికిత్స అందుబాటులో ఉంటుంది. పాలకొండ సాయినగర్ లోని హాస్పిటల్ ఆవరణలో జరిగే ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
news by: BSS Prasad
0 Comments