పాలకొండ, నాగవంశపు వీధిలోని రామాలయం వద్ద దివ్యజీవన సత్సంగ సమావేశం భక్తి పరవశంగా జరిగింది. కంచుమోజు రామ్మోహనరావు ఆధ్వర్యంలో, ఎన్ వి రమణ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో అనేకమంది వక్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్ వి రమణ భగవద్గీతపై ప్రసంగిస్తూ గీత మానవుణ్ని ధైర్యవంతునిగా తీర్చిదిద్దుతుందని పేర్కొన్నారు. కామము, క్రోధము, లోభము నరకానికి ద్వారాలని వాటిని విడిచిపెట్టాలని సూచించారు. అనంతరం డి యోగేశ్వరరావు, సిహెచ్ భాస్కరనాయుడు, సతివాడ త్రినాథస్వామి, రొంగలి చిన్ననాయుడు, ఎస్ శ్రీను, రామప్పడు, సూర్య నారాయణ రావు మాట్లాడారు. కార్యక్రమం చివర నారాయణ సేవ నిర్వహించారు. భక్తులు హాజరయ్యారు.
news by: BSS Prasad
0 Comments