ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సంఘం 31/17 అధ్యక్ష, కార్యదర్శుల ఆదేశాల మేరకు పాలకొండ మున్సిపల్ కమిషనర్ ఎస్.ఎం.జె. రతన్ రాజ్ ను రాష్ట్ర గ్రంథాలయ ఉద్యోగుల సంఘం కోశాధికారి బబ్బురు గణేష్ బాబు ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రంథాలయ సంస్థకు మున్సిపాలిటీ నుండి రావాల్సిన లైబ్రరీ సెస్ నిధులను వెంటనే విడుదల చేయాలని వారు కమిషనర్ ను కోరారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రంథాలయ ఉద్యోగులు, పెన్షనర్లు గత మూడు నెలలుగా వేతనాలు, పెన్షన్లు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని గణేష్ బాబు కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. సెస్ నిధులు సకాలంలో జమ అయితేనే ఉద్యోగుల జీతభత్యాల సమస్య పరిష్కారమవుతుందని విన్నవించారు. దీనిపై కమిషనర్ సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
news by: BSS Prasad
0 Comments