15 నుంచి ఆధార్ ప్రత్యేక శిబిరాలు

పాలకొండ వెబ్ న్యూస్..09-04-2026:​ఆధార్ బయోమెట్రిక్ నమోదు ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఈ నెల 15వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయాలని ఎస్జీఎస్ డబ్ల్యూ విభాగం నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు మరియు విద్యాశాఖ అధికారులకు ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. తొలి విడత శిబిరాలు ఈ నెల 15 నుండి 18 వరకు, మలి విడత 21 నుండి 24 వరకు అంగన్వాడీ కేంద్రాలు మరియు వార్డు సచివాలయాల్లో నిర్వహించనున్నారు. ముఖ్యంగా 15 నుండి 17 ఏళ్ల వయసు గల జూనియర్ కాలేజీ విద్యార్థుల బయోమెట్రిక్ అప్‌డేట్‌పై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. సుమారు 12.09 లక్షల మందికి బయోమెట్రిక్ పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కర్నూలు, నంద్యాల, తిరుపతి, విశాఖపట్నం జిల్లాల్లో ఈ పెండింగ్ ఎక్కువగా ఉంది. శిబిరాల నిర్వహణ కోసం ప్రతి కేంద్రానికి వెయ్యి రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. భద్రత కోసం మహిళా పోలీసుల సేవలను కూడా వినియోగించుకోనున్నారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments