సైన్స్ ఉపాధ్యాయుడు గిరడ లక్ష్మణరావుకు ఘన సన్మానం

పాలకొండ వెబ్ న్యూస్..తేదీ: 05-04-2026:
పాలకొండ పట్టణంలోని  మిత్ర సేన బృందం ఆధ్వర్యంలో సైన్స్ ఉపాధ్యాయుడు గిరడ లక్ష్మణరావును ఘనంగా సన్మానించారు. మన్యం జిల్లా ఆఫీసర్ బాధ్యతలు నిర్వహిస్తూ ఇస్రో వంటి సంస్థలను సందర్శించి, నీతి అయోగ్ ద్వారా తన సేవలను గుర్తింపుపొందిన ఆయనకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఢిల్లీలో గణతంత్ర వేడుకలకు ఆహ్వానం లభించడం విశేషం. ఈ కార్యక్రమానికి డిప్యూటీ డీఈవో కృష్ణమూర్తి, పాలకొండ ఎంఈఓ 2 సోంబాబు, వీరఘట్టం ఎంఈఓ ఆనందరావు, భామిని ఎంఈఓ శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లక్ష్మణరావు చేసిన సేవలు మరవలేనివని పేర్కొన్నారు. సైన్స్ రంగంలో అనేక ప్రాజెక్టులు రూపొందించి మంచి గుర్తింపు పొందారని అన్నారు. SA phisics teacher గా, science officer గా, వివిధ exhibitions నిర్వహణలో, CM తో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడం, ఢిల్లీ పేరిడ్‌లో పాల్గొనడం, జనవిజ్ఞాన వేదిక member గా విజయాలు సాధించడం విశేషమని తెలిపారు. కార్యక్రమం నిర్వహించిన మిత్రసేన సేవాసంస్థ నిర్వాహకులు హరిబాబు, నాదముని మధు మరియు సభ్యులకు ఏపీటీఎఫ్ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయ సంఘాలు రాము, బి.వి రమణ, సంపత్ కుమార్, వాసు పాల్గొన్నారు.
news by: BSS Prasad

Post a Comment

0 Comments