ఏప్రిల్ 19వ తేదీన పాలకొండలో ఘంటసాల సినీ సంగీత విభావరి

పాలకొండ వెబ్ న్యూస్..తేదీ: 18-04-2026:
పాలకొండ పట్టణంలో జనరంజని గానసభ ప్రారంభ కార్యక్రమంగా అమర గాయకులు పద్మశ్రీ ఘంటసాల వేంకటేశ్వరరావు స్మృతి పథంలో ఘంటసాల సినీ సంగీత విభావరి ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు స్థానిక కోటదుర్గ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో జరగనుంది. ఈ సంగీత వేదికపై గాయకులు బి. జమ్మరాజు, యం. మంగళవేణి, ఆర్. సీతంనాయుడు, జి. వెంకటరావు, పి. రామ్మూర్తి తమ గానంతో ప్రేక్షకులను అలరించనున్నారు. వీరికి వాయిద్య కళాకారులు జి. చంద్రశేఖర్, బి. వెంకటరావు, జి. సత్యనారాయణ, జి. జాన్, వై. సాయి తమ వాయిద్యాలతో సహకారం అందిస్తారు. ఈ కార్యక్రమాన్ని గౌరవ అధ్యక్షుడు కె. సుధాకర్ పర్యవేక్షణలో ఆర్గనైజర్ జి. వెంకటరావు ఏర్పాటు చేశారు. సంగీత అభిమానులు, తెలుగు భాషా మరియు సాంస్కృతిక ప్రియులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు ఆహ్వానం పలుకుతున్నారు.
news by: BSS Prasad

Post a Comment

0 Comments