పాలకొండ పెద్దకాపు హైస్కూల్లో నిర్వహించిన జనగణన శిక్షణ కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. ఈ శిక్షణలో పాల్గొన్న సిబ్బందికి తాసిల్దార్ రాధాకృష్ణమూర్తి పలు ముఖ్యమైన సూచనలు, సలహాలు అందించారు. జనగణన ప్రక్రియలో ఖచ్చితత్వం, సమయపాలన ఎంతో అవసరమని ఆయన వివరించారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలని సూచించారు. మరోసారి కూడా శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 21, 22, 23 తేదీలలో తదుపరి శిక్షణ కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు. శిక్షణ ద్వారా సిబ్బంది పనితీరు మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
news by: BSS Prasad
0 Comments