చిన్నయ్య పేటలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం

పాలకొండ వెబ్ న్యూస్, ఏప్రిల్ 18: విజయనగరం జిల్లా రేగిడి ఆమదాలవలస మండలం సంకిలి ఆయుష్ డిస్పెన్సరీ పరిధిలోని చిన్నయ్య పేట గ్రామంలో కమిషనర్ మరియు ఆర్ డి డి ఆదేశాల మేరకు నేడు ఆయుర్వేద ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. డాక్టర్ మోహనరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో అనేక మందికి వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా మోహనరావు మాట్లాడుతూ కమిషనర్ ఆదేశాల ప్రకారం ప్రతి వారం రెండు మెడికల్ క్యాంపుల చొప్పున నెలలో ఎనిమిది శిబిరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రజలకు ఆయుర్వేద వైద్యం చేరువ చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యోగ ట్రైనర్స్ ఎన్.నాగభూషణరావు, పి ఉషారాణి తదితరులు పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ ఉచిత వైద్య సేవలను గ్రామస్థులు అధిక సంఖ్యలో వినియోగించుకున్నారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments