72 కోట్లతో నీటి పథకం పనులకు శ్రీకారం.. శనివారం ప్రారంభించ నున్న ఎమ్మెల్యే నిమ్మక

​పాలకొండ వెబ్ న్యూస్..తేది: 18-04-2026:
​పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మక అడుగు వేసింది. ఇందులో భాగంగా నాన్ అమృత్ వాటర్ స్కీమ్ కింద 72 కోట్ల భారీ వ్యయంతో మంజూరైన ఇన్ఫిల్టరేషన్ వెల్ పనులకు శనివారం పునాది పడనుంది. పాలకొండ మండలం మంగలాపురం బ్రిడ్జ్ సమీపంలోని సంకిలి వద్ద నిర్వహించనున్న ఈ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో నియోజకవర్గ శాసనసభ్యులు నిమ్మక జయక్రిష్ణ పాల్గొంటారు. శనివారం ఉదయం 10:30 గంటలకు పనులు ప్రారంభించి ప్రజల నీటి కష్టాలను తీర్చే దిశగా ఈ ప్రాజెక్టును వేగవంతం చేయనున్నారు. ఈ పథకం పూర్తయితే పట్టణ ప్రాంతవాసుల దశాబ్దాల కల నెరవేరనుంది. పాలకొండ నియోజకవర్గ అభివృద్ధిలో ఈ భారీ నీటి పథకం కీలక మైలురాయిగా నిలవనుంది.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments