ఇంటర్మీడియట్ పరీక్షలలో జిల్లాస్థాయి ప్రతిభ కనబరిచిన వారికి సత్కారం

పాలకొండ వెబ్ న్యూస్..తేదీ: 17-04-2026: పాలకొండ పట్టణ పరిధిలోని 15, 16 వార్డులకు సంబంధించి ఇంటర్మీడియట్ పరీక్షలలో జిల్లాస్థాయి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను స్థానిక సంపత్ వినాయక కోవెల ఆవరణలో ఘనంగా సత్కరించారు. సత్యసాయి విద్యాసంస్థల యాజమాన్యం, కరస్పాండెంట్ దూబ వెంకటరమణ (DV) మరియు 15, 16 వార్డుల మాజీ కౌన్సిలర్స్ తుమ్మగుంట అయ్యప్ప శంకర్, కడగల వెంకటరమణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఉత్తమ ప్రతిభ కనపరిచిన పైల నవ్య ఫస్ట్ ఇయర్ 470 మార్కులకు గాను 465 మార్కులు సాధించి జిల్లా టాపర్ గా నిలవగా, 15 వార్డు పరిధి ఘట్టాలదిప్పి వీధిలో నివాసముంటున్న ఆర్ఎంపీ డాక్టర్ పీతల సింహాచలం కుమారుడు పీతల జ్ఞానేశ్వర్ రాజమండ్రి తిరుమల జూనియర్ కాలేజీలో మొదటి సంవత్సరం ఇంటర్ పరీక్షలలో 470 మార్కులకు గాను 464 మార్కులు సాధించాడు. ఈ విద్యార్థులను పెద్దలు ఆశీర్వదిస్తూ సత్కరించారు. భవిష్యత్తులో చక్కగా చదువుకొని ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయుడు నెల్లి సత్యం నాయుడు విద్యార్థులకు 1000 రూపాయల నగదు పారితోషకాన్ని బహుమతిగా అందించారు.

​ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వివేకానంద హై స్కూల్ ప్రిన్సిపాల్ గవర పారినాయుడు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం వార్డులో ఉన్నటువంటి మహిళలకు, పెద్దలకు తమ పిల్లలను బాగా చదివించి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దుప్పాడ రమణ, తుమ్మగుంట సింహాలు, జగదీష్ మరియు రెండు వార్డుల ప్రజలు పాల్గొన్నారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments