పాలకొండ వెబ్ న్యూస్..తేదీ: 19-04-2026
పార్వతీపురం: ప్రజల సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ వేదికను సోమవారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల ముందుకు తీసుకురావడానికి ఈ వేదిక ఉపయోగపడుతుందని చెప్పారు. ముఖ్యంగా రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ‘రెవెన్యూ క్లినిక్’ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫిర్యాదులను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. అదనంగా meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా అర్జీలు నమోదు చేసుకోవచ్చని, 1100 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదుల స్థితిని తెలుసుకోవచ్చని సూచించారు.
0 Comments