పాలకొండ సబ్ కలెక్టర్ సీతంపేట ఐటిడిఏ సమావేశ మందిరంలో సిడిఎస్‌టీలు మరియు పాలకొండ, వీరఘట్టం, సీతంపేట, భామిని మండలాల రేషన్ షాప్ డీలర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నిత్యావసర సరుకులను ప్రజలకు నిర్ణీత సమయానికి సరఫరా చేయాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయాలు జరగాలని, సరుకుల నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. నిరుపేదలకు పంపిణీ చేసే సరుకుల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకమైన సేవలు అందించాలని కోరారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిపై మరియు నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ ఈ సందర్భంగా హెచ్చరించారు.
news by: BSS Prasad
0 Comments