అఖిల భారత కిసాన్ సభ 90వ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 11న నిర్వహించాలి

పాలకొండ వెబ్ న్యూస్, 11 ఏప్రిల్ 2026:

​అఖిల భారత కిసాన్ సభ 90వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాదరావు పిలుపునిచ్చారు. 1936 ఏప్రిల్ 11న లక్నో వేదికగా దేశంలోని వివిధ ప్రాంతాల రైతు నాయకుల కలయికతో ఈ సభ ఆవిర్భవించిందని ఆయన గుర్తు చేశారు. జమీందారీ విధాన రద్దు, స్వాతంత్య్ర ఉద్యమాన్ని గ్రామగ్రామానికి విస్తరించి రైతాంగాన్ని భాగస్వామ్యం చేయడంలో కిసాన్ సభ కీలక పాత్ర పోషించిందని వివరించారు. ప్రపంచ బ్యాంకు ఒత్తిడితో వచ్చిన నూతన వ్యవసాయ విధానాలను ఎదిరించి, ఆహార భద్రత మరియు ఉపాధి హామీ చట్టాల సాధనలో ఈ సంస్థ అగ్రభాగాన నిలిచిందని కొనియాడారు.

​స్వామినాథన్ కమిషన్ సి2+50 సిఫార్సుల అమలు కోసం, మద్దతు ధరల చట్టం కోసం నిరంతరం పోరాడుతున్నట్లు ప్రసాదరావు తెలిపారు. ఢిల్లీ శివార్లలో 13 నెలల పాటు సాగిన చారిత్రాత్మక రైతు ఉద్యమంలో సంయుక్త కిసాన్ మోర్చా ఏర్పాటులో కిసాన్ సభ ముఖ్య భూమిక పోషించిందని చెప్పారు. పెదకాపువీధిలో డివిజన్ రైతు సంఘ కార్యదర్శి గార రమణ ఆధ్వర్యంలో ఉదయం పది గంటలకు జరగనున్న పతాకావిష్కరణ కార్యక్రమంలో రైతులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments