ఈ కార్యక్రమంలో టౌన్ పార్టీ అధ్యక్షుడు గుమ్మడి సింహాద్రితో పాటు మాజీ నీటి సంఘం అధ్యక్షుడు మజ్జి జయశంకర్, 1వ వార్డు కౌన్సిలర్ ప్రతినిధి రాంబాబు మరియు పొట్లి మాజీ సర్పంచ్ ప్రతినిధి కర్నేన గణేష్ నాయుడు పాల్గొన్నారు. వీరితో పాటు తెలుగుదేశం నాయకులు హనుమంతు రాము, ఎస్ బుజ్జి తదితరులు పాల్గొని నియోజకవర్గ పరిధిలోని పార్టీ కార్యకలాపాలపై ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత ఉత్సాహంగా ముందుకు తీసుకువెళ్లేందుకు నాయకులందరూ సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. నియోజకవర్గ అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తామని నాయకులు స్పష్టం చేశారు.
news by: BSS Prasad
0 Comments