పాలకొండ నగర పంచాయతీ అభివృద్ధికి మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ నిధులు కేటాయిస్తామని తెలిపారు. ఆదివారం పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించిన ఆయన, ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణతో కలిసి పారిశుధ్యం, తాగునీరు, రోడ్ల విస్తరణ సమస్యలను పరిశీలించారు. అనంతరం కార్యాలయంలో ప్రత్యేకాధికారి పవార్ స్వప్నిల్, కమిషనర్ రత్నరాజ్‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకు 72 కోట్ల పనులు త్వరలో పూర్తి చేస్తామని, డ్రైనేజీ నిర్మాణానికి 12 కోట్లు మంజూరు చేస్తామని చెప్పారు. డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారానికి చెత్త ప్రాసెసింగ్ యూనిట్ మంజూరు చేస్తామని, రోడ్ల విస్తరణ పనులు త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. నగర శుభ్రత కోసం 5 లక్షలు విడుదల చేయాలని ఆదేశించారు.
news by: BSS Prasad
0 Comments