శాఖల మధ్య సమన్వయ లోపం: సాగునీరు అందక పాలకొండ రైతాంగం విలవిల

పాలకొండ వెబ్ న్యూస్..తేదీ: 05 ఏప్రిల్, 2026:​వ్యవసాయంపై ఆదాయం తగ్గి రైతులు నష్టపోవడానికి వ్యవసాయ మరియు జలవనరుల శాఖల మధ్య సమన్వయం లేకపోవడమే కారణమని అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాదరావు ఆవేదన వ్యక్తం చేశారు. రబీ సీజన్లో నీటి ఎద్దడి దృష్ట్యా వరి సాగు తగ్గించి ఆరుతడి పంటలు వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించినప్పటికీ, అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించడంలో విఫలమయ్యారని విమర్శించారు. ఒక ఎకరా వరికి సరిపడే నీటితో ఐదు ఎకరాల ఆరుతడి పంటలు పండించవచ్చని, ముందస్తుగా రైతు శిక్షణ తరగతులు నిర్వహించి ఉంటే పాలకొండ రైతాంగానికి ఈ పరిస్థితి వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. తోటపల్లి ఎడమ కాలువ పరిధిలో ఎగువన పది వేల ఎకరాల్లో వరి వేయడం వల్ల దిగువన ఉన్న 45 వేల ఎకరాలకు సాగునీరు అందక, పశువుల దాహార్తి కూడా తీరడం లేదని తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ప్రసాదరావు కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments